జాగ్రత్త
బతుకు పుస్తకంలో
ఎన్ని పేజీలో
తెలుసా ఎవరికైనా
చివరి పుటలో ఏముందో
చూశారా ఎవరైనా
చిరగకుండా పేజీలు
తిప్పగలిగారా ఎప్పుడైనా
పేజీవెంట పేజీ తిరగడమే..
అందులో ప్రమేయం ఎవరికుంది
చిట్టచివరి పుట
ఆఖరి అక్షరం చదివేశాక
మొదటి పుట మొదటి అక్షరానికి
తిరిగి వెళ్లలేం కదా
అందుకే...
పుస్తకం తెరచినప్పుడే
జాగ్రత్త పడాలి
తప్పులు లేకుండా
వీలైనంత తక్కువ చిరుగులతో
బతుకు పుస్తకం ముడవాలి
Comments
Post a Comment