Posts

❤️అప్పుడు కన్నయ్య పరిస్థితి ఏమిటో!❤️

Image
కృష్ణ సౌందర్యానికి గోపికలందరూ మూర్చనలు పోయారట. తీరుకొక్క రూపుతో బహురూపిగా మారిన కన్నయ్య వారితో రాసలీలలాడి ముచ్చట తీర్చాడట. రాధ అందమేమైనా చిన్నదా చితకదా. ఆ లీలామానుష విగ్రహుడినే వశీకరించేసింది కదా. మరి అంతటి అద్భుత సౌందర్యానికి ఆఫ్ట్రాల్ గోపాలురు... ఫిదా కాకుండా ఉంటారా? అటువంటప్పుడు రాధ కూడా ఆ గోపాలుర ఆశ తీర్చడానికి వారందరితో కలిసి బహురూపదారియై రాసలీల నృత్యం చేస్తే... కృష్ణుడు గోపికలను చేసినట్టే గోపాలురందరినీ సంతృప్తి పరిస్తే... అప్పుడు ఆ కృష్ణుడు రాధను మరింతగా అక్కున అదుముకుని చుంబనాలు కురిపించేవాడా... లేక అరచి గోలచేసి గెటవుట్ అనేవాడా... ఇవేవీ కాక శాలువ భుజాన వేసుకుని, వేణువు అధరాన చేర్చుకుని విషాద రాగాలు ఆలపిస్తూ ఆలమందలకు కన్నీరు కార్పించేవాడా... ఎప్పటినుంచో నాకో చిన్న డౌట్. ఎవరైనా తీర్చేవారుంటే ఇలా వచ్చి కామెంట్ చేసి పుణ్యం కట్టుకుంటారా! ముని ✍️

సారథి

Image
మాటలో శ్రావ్యత క్రియలో నిబద్ధత మనసులో ప్రణయత వ్యక్తిత్వంలో స్థితప్రజ్ఞత దేవుడైనా... గోపాలుడైనా... జీవన సారథి అతడు నిన్ను గెలిపించే బోధకుడు ముని ✍️

నేను చదువుతున్న పుస్తకం.. బొలీవియా డైరీ

Image
  ❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️ 👉 బొలీవియా డైరీ (1966 నవంబరు 7 - 1967 అక్టోబరు 7) రచయిత: చే గువేరా (గెరిల్లా పోరాటకాల రోజువారీ అనుభవాలు) "... మరి కాసేపటికే ఒక సైనికుడు మాకు ఎదురువచ్చాడు. అతనితోపాటు మూడు జర్మన్ వేటకుక్కలు, ట్రెయినరు కూడా ఉండడంతో మేం నివ్వరపోయాం. వాళ్ళు మమ్మల్ని వదలరని అర్థమైపోయింది. ముందుకు మీదకు వస్తున్నారు. నేను ముందుగా వస్తున్న కుక్క మీదకు గుండు పేల్చా, గురితప్పింది. ట్రెయినర్ మీద గన్ను గురిపెట్టా. తుపాకి 'జామ్' అయిపోయింది. మిగ్యుయెల్ ఒక కుక్కని చంపాడు. ఇంకెవరూ ఉచ్చులో పడలేదు. సైనిక పటాలం మీద ఆగాగి తుపాకులు పేలాయి. కాల్పుల శబ్దం ఆగిపోగానే మన వాళ్ళను వెనక్కి వచ్చెయ్యమని పిలుచుకు రావడానికి ఆర్బానోను పంపాను. తను వెళ్ళి వచ్చి రోలాండో గాయపడ్డాడనే వార్త చెప్పాడు. మరికాసేపటికి అతన్ని తీసుకువచ్చారు. అప్పటికే అతని ఒంట్లోంచి చాలా రక్తం పోయింది. మనిషి చాలా వేగంగా కృశించిపోతున్నాడు. మేం అతనికి ప్లాస్మా ఇవ్వనారంభించాం. అంతలోనే అతను మరణించాడు. తుపాకి గుండు అతని తొడ ఎముకని, నరాలు, కండరాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. మేం ఏదన్నా చేసేలోపే  అతను రక్తమోడుతూనే అలా కన్ను ...

నూర్రూపాయలు

Image
  Sign In MENU  నూర్రూపాయలు నూర్రూపాయలు  (Author: చిట్టత్తూరు మునిగోపాల్) “ఏయ్.. ఏయ్.. ఏమిటా పని? వద్దు వద్దు, అలా చేయద్దు..” వణికిపోతూ అరిచాను. కాదు, అరవాలనుకున్నాను. గొంతు పెగిలితేగా... అల్లల్లాడిపోతోంది వాడి చేతుల్లో నా శరీరం. “రేయ్ శంకర్, ఏం చేస్తున్నావురా. ఏమిటాపని? నీకేమన్నా పిచ్చిపట్టిందా?” ఎవరో పుణ్యాత్మురాలు, వారిస్తూ ముందుకొచ్చి వాడి చేతులనుంచి నన్ను జాగ్రత్తగా విడిపించి తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటికీగానీ నా వణుకు తగ్గలేదు. భద్రంగా ఆ మెత్తటి చేతుల్లో ముడుక్కున్నాను. వాడేం మాట్లాడలేదు. వెక్కుతున్నాడు. బుగ్గలపై కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇంతకుముందు నుంచీ అంతే. ఒకటే ఏడుస్తున్నాడు. మొదట వీడే నన్ను విసిరి వీధిలో కొట్టింది. మళ్ళీ తనే నన్ను వెదికి పట్టుకుని ఇదిగో, ఇలా స్కూల్ దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు తీసుకుని వచ్చాడు. హమ్మయ్య అనుకునే లోగానే, ఇలా నన్ను ముక్కలుముక్కలు చేయడానికి తెగించాడు. ఈమెవరో కానీ సమయానికి ఇటువైపు రాకుంటే- అమ్మో... మళ్ళీ భయం వేసింది. “నమస్తే టీచర్.” దారిన వెళ్తున్న పిల్లలు నమస్కారాలు చేస్తుంటే తెలిసింది, ఆమె స్కూల్ టీచర్. చాలా మంచిదట. స్కూల్లో ఈ శం...

నేను చదువుతున్న పుస్తకం- నల్లమిరియం చెట్టు

Image
  ❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️ 👉 నల్లమిరియం చెట్టు రచయిత: డా. వి.చంద్రశేఖరరావు “దళితులంటే, ఒక కేటగిరి. తప్పనిసరి కోటా. పేదవాళ్ళకంటే హీనమైన కేటగిరి. నేను మధ్యతరగతి మనిషిని, రాజకీయ నాయకుణ్ణి, Z.P.ఛైర్మన్ని ఇవేం నిజం కావు. నేను దళితుడన్నదే నిజం". “రాజకీయంగా, నాకు కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి. ఐడియా లున్నాయి. కానీ నేను దళితుణ్ణి. నా స్వంత ఆలోచనలు చేయటం నిషిద్ధం. పార్టీ చెప్పిన మాటకు తల ఊపే గంగిరెద్దుని నేను. పెరట్లో కట్టివేసుకున్న కుక్కను”. పార్టీలో, ఆఫీసులో, నాది దళిత ముఖం. నన్ను రిఫర్ చేస్తూ అందరూ ముఖం చిట్లిస్తారు. నేను దళితుల ప్రతినిధిని అని ప్రకటిస్తారు. నన్ను మూలాల నుంచి వేరు చేస్తారు. నేనొక మాస్క్ ను”. "ఇక్కడ దళితుడిగా జీవించటమంటే భయం గొలిపే ఒంటరితనం". -- నల్లమిరియం చెట్టు

నేను చదువుతున్న పుస్తకం- మాక్సిమ్ గోర్కీ కథలు

Image
 ❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️ 👉 మాక్సీమ్ గోర్కీ కథలు మూల రచయిత: మాక్సీమ్ గోర్కీ అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి   "మనిషి యెవరిమీదనో ఒకరి మీద తన ప్రేమను నిలుపుకోవాలనుకుంటాడు. ఆ ప్రేమ తోటి ప్రాణిని తరచుగా బాధించినప్పటికీ, ఒకోసారి నీచపరిచినప్పటికీ, ఆ ప్రాణి జీవితాన్నే విష కలుషితం చేసినపప్పటికీ కూడా; యెందుకంటే మనిషి ప్రేమించడంలో ప్రేమించబడిన వ్యక్తి పట్ల గౌరవం వుండదు. తాన్యా పట్ల మా ప్రేమ అగత్యమైనది. ప్రేమించడానికి మాకు మరెవరూ లేరు గనుక." -- 26 మంది పురుషులూ, ఒక అమ్మాయీ "పూర్వకాలంలో యెన్ని మంచి విషయాలు వుండినాయో చూడు! యిప్పుడు యేమీ లేవు- మనుషులు లేరు, గొప్ప పనులు లేవు, కథలు లేవు -నీవు చెప్పలేవు. నీకేం తెలుసు? మీ యువకుల్లో యెవరికైతే యేం తెలుసు? గతాన్ని రేఖలకు పూర్వకాలం నాటి వాటితో పోల్చ దగినవి యేమీ లేవు. యెందుకు? చెప్పుమరి. అం. శోదిస్తే జీవిత సమస్యల కన్నిటికీ జవాబులు దొరుకుతాయి, కానీ మీ రావని చేయరు. అందువలన మీకేమీ తెలియదు. యేమి జరుగుతున్నదో నేను గమనించలే ననుకున్నావా? యెంతో బాగా గమనిస్తున్నాను. కండ్లు బలహీనమైనప్పటికీ, మనుషులు జీవించడానికి బదులు జీవితానికి సిద్ధం కావడం...

నేను చదువుతున్న పుస్తకం- విషాద కామరూప

Image
👉 విషాద కామరూప మూలం: ఇందిరా గోస్వామి అనువాదం: గంగిశెట్టి లక్ష్మీనారాయణ     ప్రాంతం ఏదైనా, భాషలు వేరైనా గతం కొద్ది భేదాలతో ఒకటే. జమీందారీ వంశాలకు ఒక్కోచోట ఒక్కో పేరు. అస్సాంలో గోసాయిలంటారు. ఇక్కడ వైష్ణవ మఠాల ఆధిపత్యం తక్కువేమీ కాదు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఈ గోసాయీలు, మఠాలు అనంతరం ఎంత క్షీణ స్థితికి చేరాయో.. నాటి వితంతువులు గడిపిన దుర్భర పరిస్థితులేమిటో 320 పేజీల ఈ నవల మన కట్టెదుట ప్రదర్శిస్తుంది. నాటి చారిత్రక పరిణామాలని కథలో కలగలిపి చిత్రిక పడుతుంది. కాదనుకుంటే... మూల రచయిత, అనువాదుకుల తొలి, మలి పలుకుల్లో కొంచెం కొంచెం  కింద ఇచ్చాను, వినండి. ముని ✍️      ఈ నవలలోని పాత్రలన్నీ కల్పితాలే. అయితే నా అనుభవాలు, జీవితంలో ఎదురైన కొందరు వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు వీటికి ప్రేరణనిచ్చాయి. అస్సాంలోని కామరూప జిల్లాలో మారుమూల ఓ సత్రా* చుట్టూ ఉన్న చిన్న గ్రామాన్ని గురించి ఈ నవల వర్ణిస్తుంది. పందొమ్మిదవ శతాబ్దం ప్రథమ పాదం (1820) మొదలు బ్రిటిషు పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన సంవత్సరం (1947-48) దాకా, సుమారు వందా పాతికేళ్ళపాటు ఓ గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాథ ఈ నవ...