Posts

Showing posts from March, 2026

ఇష్టంగా బతకాలి

“కూసో అబయా..” యాపసెట్టు కింద నులకమంచం వాల్చినాడు ఆయన్న. జంకతా కూసున్నాను. “ఇప్పుడు నువ్వు కూసోనుండా, ఈ జాగా ఎవురిదో తెలుసా అబయా?” నెత్తికి చుట్టిన తలగుడ్డ తీసి ఇదల్చతా మోకాళ్ళు రొండూ వొంచి మంచం పట్టీ పట్టుకొని గొంతు కూర్చుని నా మొగంలోకి చూసినాడు. చుట్టూ చూసినాను. కొంచెం దూరంలో నా ఎదురుగా బర్రిగొడ్లు కొయ్యి కూసాలకు కట్టేసుండాయి. వొక వారగా నేరేడు చెట్టుకు కుడితి తొట్టి ఆనించి ఉండాది. ఇంగో పక్క తురాయి చెట్టు మొదుట్లో కళ్ళాపి బాన గావాల, పచ్చిగా అదోరకం వాసన కొడతా వుండాది. జోబులోనించి చేతిగుడ్డ బయటకు తీసి ముక్కలకు అడ్డం పెట్టుకున్నాను. “నాకెలా తెలుస్తుంది నా. ఈ ఊరిలో జాగాల సంగతి?” నా మాటలో యాస కనిపిచ్చకుండా చేయాలంటే కష్టంగా అనిపిస్తా వుండాది. “ఇది మీ జాగానే. నువ్వు కుచ్చోనుండా, ఈ యాపసెట్టు మీ వాకిట్లో సెట్టే.” నవ్వు మొగంతో ఆయన్న చెప్పిన మాట యినంగానే మంచం మీద కిందికి ఏలాడేసిన కాలుపై పెట్టిన కుడికాలు కిందకి జారిపొయ్యింది. “నేనెవురో తెలుసానా మీకు?” అడిగాను కొంచెం ముందుకు వొంగి. “ఎందుకు తెలీదబయా. ఆ ముక్కూమొగం అంతా మునిరాంబావ నోట్లో నించి ఊడిపడినట్టే ఉండ్లా .” అప్పుడే కయ్యినుంచి వొచ్చ...

కలడో... లేడో!

Image
  స్పీ కర్ లోంచి శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం శ్రావ్యంగా ప్రారంభమైంది. ఇంకా తెర తొలగలేదు. మా ముందు నిలుచున్నది ఒక మధ్య వయసు జంట. వాళ్ళు కదిలితేనే మేమూ ముందుకు కదల గలిగేది. నాకెందుకో ఆమె నిలుచున్న తీరులో తేడా కనిపించింది. అంతదాకా భర్త భుజం పట్టుకుని నిలుచున్న ఆమె, అంతలోనే అదే భుజం మీద వాలిపోయింది. కుడిచేతిలో ప్రింటవుట్ పేపర్ పట్టుకుని, అందులోని శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని స్పీకర్ లోంచి వెలువడే శబ్దాలకు అనుగుణంగా అరమోడ్పు కళ్ళతో చదువుకుని పోతున్న ఆయన ఆ పని వీడలేదు. కాకపోతే తన ఎడమ చేతిని ఆమె వీపు చుట్టూ చుట్టి మరింత గట్టిగా పట్టుకున్నాడు. అక్షరాల నుంచి చూపు మరల్చకుండానే, కుడిచేతిలోని ప్రింటవుట్ ను భార్య ముఖం ముందుకు జరిపాడు. ఆయన చేష్టలు చూస్తుంటే నాకూ అనిపించింది, ఆమెది భక్తిపారవశ్యమేమోనని. అంతలోనే భర్త భద్రమైన భుజం పట్టునుంచి కిందికి జారిపోతోంది ఆమె. ఆ జంట వెనుక నిలుచున్న మాకే కాదు, ఇటుపక్కలా వేచివున్న మరికొందరికి కూడా తెలిసి పోయింది- అది భక్తి పారవశ్యం కాదు, సొమ్మసిల్లి పోవడమని. కానీ అపారమైన భక్తిలో మునిగి శ్రీవారి సుప్రభాత పారాయణంలో తరిస్తున్న ఆ భర్త శిఖామణికి మాత్రం ఆ స్పృహ లేదు. అ...

ఎన్నైనా అనండి

Image
  ❤️ ఎన్నైనా అనండి! ❤️ తాతలుండేవాళ్ళు వీధి అరుగుపై విశ్రాంతికి రూపునిస్తూ పెరళ్ళుండేవి పచ్చపచ్చగా అలిసిన ప్రాణాలను సేదతీరుస్తూ చేదబావులుండేవి చలచల్లగా డస్సిన గొంతులో తియ్యటి జలాన్ని చిలకరిస్తూ కాలాన్ని వెనక్కి తిప్పాలనుకోడం... చాదస్తమైతే కావచ్చు కాలాన్ని గెలిచేద్దామని పరుగులు పెట్టడం... మూర్ఖత్వం అవునా కాదా! మీరు ఎన్నైనా అనండి ఇంత చద్దిమూట భుజానేసుకుని నింపాదిగా జీవితాన్ని దాటడం రానంత వరకు డిప్రెషన్ల మూకుమ్మడి ముట్టడిలో బతుకులు  బరస్ట్ అవుతూనే ఉంటాయి అహంకార క్షిపణి దాడుల్లో సామ్రాజ్యాలు  గల్లంతవుతూనే ఉంటాయి 👉 చిత్రం: లాస్య

"పెరటి" పదం

Image
  నేడోరేపో రాలిపోవడం తథ్యమని తెలిసినా అందంగా విరిసి  అందరికీ ఆనందాన్ని పంచుతుంది సుమం చెంతనే ఎదుగుతున్న పసి మొగ్గకు ఎలా జీవించాలో అనుభవాల రేకులు విప్పార్చి నేర్పుతుంది                                                ముని ✍️

ఇక్కడెవరైనా...

Image
  వాట్సాప్... ఫేస్బుక్... ఇన్స్టా...  హోరెత్తిపోతున్నారు నేతలు మరి ఊళ్లు... జనం గూళ్ళు... మిగిలారా ఇక్కడెవరైనా!

చాలించిక

Image
నువ్విలా మౌనంలో మునిగితే అక్కడేమిటా అనల విలయం గరళం గొంతులో ఉంచింది నిజమైతే మానవ జాతిపై ఎందుకా విష ప్రళయం మెడలో నాగేంద్రహారం సరే భూమిపై అహంకరించి ఫూత్కరిస్తున్న  మిన్నాగుల సంగతేమిటి? నువ్వు భస్మాంగరాగ బైరాగివని తెగిపడిన శరీరాంగాలను ధరించి బూడిదకుప్పల్లో పొర్లాడమంటావా? లయకారకా చాలించురా నీ తపం నువ్వంటూ ఉంటే నిజంగా జ్వాలాకీలల్లో పల్లార్చు పడగల అహం! 👉 చిత్రం: చిట్టత్తూరు లాస్య

"పెరటి" పదం

Image
  తాళింపు సాంబారు తీయగూరయు కాన దిగులేల కూరకు పెరటి పంటగ లేన వంకాయ గోంగూర షడ్రుచులు వేయైన దిగదుడుపు నా రసము నమిలి జుర్రితె చాన

ఉపాధ్యాయుడు వెళ్లిపోతున్నాడు

Image
— ఇది NCERT మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్ రాసిన వ్యాసం మరియు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రచురితమైంది. ఈ వ్యాసం యొక్క సారాంశం ఇది: నేటి భారతదేశంలోని పాఠశాలల్లో నిశ్శబ్దంగా కానీ తీవ్ర ఆందోళన కలిగించే విప్లవం జరుగుతోంది ఇది ఉపాధ్యాయుల మనస్సులలో అలసట, నిస్సహాయత మరియు నిరాశ. ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలివేస్తున్నారు - కొందరు నిశ్శబ్దంగా, కొందరు మానసికంగా దూరంగా ఉన్నారు. ఇంతలో, కొత్త తరం ఉపాధ్యాయులుగా మారడానికి ఆసక్తి చూపడం లేదు. దీనికి కారణం ఏమిటి? 🔹 1. ఉపాధ్యాయుల చుట్టూ ఉన్న బ్యూరోక్రసీ 📍 ఉపాధ్యాయులు బోధన కంటే నివేదికలు, ఫారమ్‌లు మరియు డేటాను అప్‌లోడ్ చేయడంలో ఎక్కువగా పాల్గొంటారు. 📍 “ఫోటో పంపండి,” “సాక్ష్యం ఇవ్వండి,” “నివేదికను అప్‌లోడ్ చేయండి” — ఇది వారి దైనందిన జీవితం. 📍 తరగతి గదిలో గడిపే సమయం తగ్గింది మరియు కంప్యూటర్ స్క్రీన్ ముందు గడిపే సమయం పెరిగింది. 🔹 2. టెక్నాలజీపై అతిగా ఆధారపడటం 📍 ప్రతి సబ్జెక్టుపై డిజిటల్ టూల్స్, యాప్‌లు మరియు స్మార్ట్ బోర్డులు విధించబడుతున్నాయి. 📍 సబ్జెక్టు, పిల్లల వయస్సు లేదా సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోకుండా “టెక్నాలజీని ఉపయోగించు” అని ఆదేశాలు వస్తున్...

"పెరటి" పదం

Image
  రెమ్మరెమ్మకూ చిగురింత తిరగమోతలో గుబాళింత

నిజంగానే...

Image
  నిజంగానే గ్రహణం విడిచిందా...!?

కలడో... లేడో!

Image
తెల్లవారుజామున 1.45 గంటలకు సుపథం క్యూ కాంప్లెక్స్ 1 లో రిపోర్ట్ చేశాము నేను, నా సతీమణి ప్రవీణ. ఏడుకొండలవాడి సుప్రభాత సేవకు వెళ్లాలంటే అదే సమయమట. తెల్లవారుజాము 2 గంటలకు మొదలైన క్యూ ప్రస్థానం, 2.50 కి వెంకన్న వైకుంఠం సప్తద్వారాల ముందు నిలిచింది. క్యూలో "గోవింద"లు తక్కువే కానీ, ఇక్కడకు చేరేసరికి ఎక్కువయ్యాయి భక్తుల గొంతులు. ఇంకా ద్వారానికి ఉన్న తెర తొలగలేదు.  పది నిముషాలు వేచాక, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం స్పీకర్ నుంచి శ్రావ్యంగా మొదలైంది. ఆ సుస్వర ఝరి 3 గంటల 19 నిముషాల 42 సెకన్ల దాకా సాగి ఆగింది. గిర్... ర్... ర్... మన్న శబ్దంతోపాటు ఒక్కసారిగా గోవిందలు ఆ వైకుంఠ సప్తద్వారాల ముందున్న ఆలయ ప్రహరణం దాటి మిన్నంటాయి. ఉలిక్కిపడి చూద్దునుగదా... ఘంటారావంతో తెర తొలగింది. అంతలోనే మూతపడి, మళ్లీ రెండు నిముషాలకల్లా ఓ వారకు తెర జారింది. సప్తద్వారాలలోకి జనప్రవాహం వెల్లువైంది. సప్తద్వారాలు దాటుతున్నప్పుడు భక్తులకు ఎంత ఆత్రమో... ఇక్కడినుంచే తమ స్వామిని చూడాలని. ఒకరి తలపై నుంచి ఒకరు నిక్కి చూస్తూ... ఒకరి భుజాలను ఒకరు నెట్టుకుంటూ...!  ఇంకొద్ది క్షణాల్లో మనమూ ఆ ముందు వరుసకు వెళ్లి, ఆయన ఎదుట నిలుచుంటా...