చాలించిక



నువ్విలా మౌనంలో మునిగితే

అక్కడేమిటా అనల విలయం

గరళం గొంతులో ఉంచింది నిజమైతే

మానవ జాతిపై ఎందుకా విష ప్రళయం

మెడలో నాగేంద్రహారం సరే

భూమిపై అహంకరించి ఫూత్కరిస్తున్న 

మిన్నాగుల సంగతేమిటి?

నువ్వు భస్మాంగరాగ బైరాగివని

తెగిపడిన శరీరాంగాలను ధరించి

బూడిదకుప్పల్లో పొర్లాడమంటావా?

లయకారకా చాలించురా నీ తపం

నువ్వంటూ ఉంటే నిజంగా

జ్వాలాకీలల్లో పల్లార్చు పడగల అహం!


👉 చిత్రం: చిట్టత్తూరు లాస్య

Comments