Posts

Showing posts from November, 2026

అలుపొస్తే ఆగిపో

Image
దూరమెంతైనా సాగిపో కానింత ఆకాశాన్ని కాసింత పచ్చిగాలిని పిసరంత నీటిచెమ్మను మూటగట్టి భుజానేసుకో అలుపొస్తే ఆగిపో చాళ్లలో నాలుగిత్తులు జల్లి మట్టిని ముద్దుపెట్టుకో నీకు నువ్వు మిగులుతావు కమ్మటి చద్దిముద్దలా బతుకుతావు ముని ✍️