Posts

Showing posts from July, 2026

నేను చదువుతున్న పుస్తకం- విషాద కామరూప

Image
👉 విషాద కామరూప మూలం: ఇందిరా గోస్వామి అనువాదం: గంగిశెట్టి లక్ష్మీనారాయణ     ప్రాంతం ఏదైనా, భాషలు వేరైనా గతం కొద్ది భేదాలతో ఒకటే. జమీందారీ వంశాలకు ఒక్కోచోట ఒక్కో పేరు. అస్సాంలో గోసాయిలంటారు. ఇక్కడ వైష్ణవ మఠాల ఆధిపత్యం తక్కువేమీ కాదు. ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఈ గోసాయీలు, మఠాలు అనంతరం ఎంత క్షీణ స్థితికి చేరాయో.. నాటి వితంతువులు గడిపిన దుర్భర పరిస్థితులేమిటో 320 పేజీల ఈ నవల మన కట్టెదుట ప్రదర్శిస్తుంది. నాటి చారిత్రక పరిణామాలని కథలో కలగలిపి చిత్రిక పడుతుంది. కాదనుకుంటే... మూల రచయిత, అనువాదుకుల తొలి, మలి పలుకుల్లో కొంచెం కొంచెం  కింద ఇచ్చాను, వినండి. ముని ✍️      ఈ నవలలోని పాత్రలన్నీ కల్పితాలే. అయితే నా అనుభవాలు, జీవితంలో ఎదురైన కొందరు వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు వీటికి ప్రేరణనిచ్చాయి. అస్సాంలోని కామరూప జిల్లాలో మారుమూల ఓ సత్రా* చుట్టూ ఉన్న చిన్న గ్రామాన్ని గురించి ఈ నవల వర్ణిస్తుంది. పందొమ్మిదవ శతాబ్దం ప్రథమ పాదం (1820) మొదలు బ్రిటిషు పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన సంవత్సరం (1947-48) దాకా, సుమారు వందా పాతికేళ్ళపాటు ఓ గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాథ ఈ నవ...

నాయన... ఒక శాపగ్రస్తుడు!

Image
చిట్టత్తూరు నాదముని...! ప్యాంటు షర్టు... నడుముకు బిగించిన బెల్టు... చెమటలు కారి కేలర్ పాడైపోకుండా మెడకింద క్రాస్ గా మడిచి పెట్టిన కర్చీఫు... ఎడమ చేతికి నల్ల పట్టీతో బిగించిన హెచ్. ఎమ్.టి. రిస్టు వాచ్... మా నాయన చాలా సాధారణమైన మనిషి.  డొక్కు సైకిలు... దాని బారుకు కట్టిన మూడు గిన్నెల స్టీలు క్యారేజీ... వెనుక క్యారేజీ సీట్లో మడత పెట్టిన కాకి సంచి... ప్రతి ఉదయం సమయానికన్నా అర గంట ముందే చెమటలు కక్కుకుంటూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే బడిలో వాలిపోవడం... మా నాయన సామాన్యమైన బడి పంతులు. ఎందుకో అప్పుడు తెలియదు కానీ , అమ్మకు తిట్లు... ఏడాదిలో ఎప్పుడో అప్పుడు నన్ను చదువుకు కూర్చోబెట్టి వీపుపై పిడిగుద్దులు... నాయన మహా కోపిష్టి. అమ్మకు సైగ చేసి ప్లేట్లో వడ్డింపజేసే అంగట్లో తెచ్చిన కారాసు పలుకులు... ప్రతి శనివారం నాకోసం ఆకులో మిగిల్చే నూనెకారం తడిసిన రుచులూరే దోసె ముక్కలు... టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు వండించి పెట్టిన ఉలస చేపల కూరలు... జబ్బుపడ్డ నా బెడ్ పక్కనే ఆస్పత్రిలో ఒట్టి నేలపై పడిగాపులు... నాయన బయటపడని ప్రేమిష్టి. అటకమీద అట్టపెట్టెల్లో గుట్టలుగా కథల పుస్తకాలు... తిన్నెమీద గుడ్డి దీపపు వెలుగుల...