నూర్రూపాయలు
Sign In MENU నూర్రూపాయలు నూర్రూపాయలు (Author: చిట్టత్తూరు మునిగోపాల్) “ఏయ్.. ఏయ్.. ఏమిటా పని? వద్దు వద్దు, అలా చేయద్దు..” వణికిపోతూ అరిచాను. కాదు, అరవాలనుకున్నాను. గొంతు పెగిలితేగా... అల్లల్లాడిపోతోంది వాడి చేతుల్లో నా శరీరం. “రేయ్ శంకర్, ఏం చేస్తున్నావురా. ఏమిటాపని? నీకేమన్నా పిచ్చిపట్టిందా?” ఎవరో పుణ్యాత్మురాలు, వారిస్తూ ముందుకొచ్చి వాడి చేతులనుంచి నన్ను జాగ్రత్తగా విడిపించి తన చేతుల్లోకి తీసుకుంది. అప్పటికీగానీ నా వణుకు తగ్గలేదు. భద్రంగా ఆ మెత్తటి చేతుల్లో ముడుక్కున్నాను. వాడేం మాట్లాడలేదు. వెక్కుతున్నాడు. బుగ్గలపై కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇంతకుముందు నుంచీ అంతే. ఒకటే ఏడుస్తున్నాడు. మొదట వీడే నన్ను విసిరి వీధిలో కొట్టింది. మళ్ళీ తనే నన్ను వెదికి పట్టుకుని ఇదిగో, ఇలా స్కూల్ దగ్గరలో ఉన్న చెట్టు చాటుకు తీసుకుని వచ్చాడు. హమ్మయ్య అనుకునే లోగానే, ఇలా నన్ను ముక్కలుముక్కలు చేయడానికి తెగించాడు. ఈమెవరో కానీ సమయానికి ఇటువైపు రాకుంటే- అమ్మో... మళ్ళీ భయం వేసింది. “నమస్తే టీచర్.” దారిన వెళ్తున్న పిల్లలు నమస్కారాలు చేస్తుంటే తెలిసింది, ఆమె స్కూల్ టీచర్. చాలా మంచిదట. స్కూల్లో ఈ శం...