నేను చదువుతున్న పుస్తకం- మాక్సిమ్ గోర్కీ కథలు

 ❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️

👉 మాక్సీమ్ గోర్కీ కథలు
మూల రచయిత: మాక్సీమ్ గోర్కీ
అనువాదం: రాచమల్లు రామచంద్రారెడ్డి





 "మనిషి యెవరిమీదనో ఒకరి మీద తన ప్రేమను నిలుపుకోవాలనుకుంటాడు. ఆ ప్రేమ తోటి ప్రాణిని తరచుగా బాధించినప్పటికీ, ఒకోసారి నీచపరిచినప్పటికీ, ఆ ప్రాణి జీవితాన్నే విష కలుషితం చేసినపప్పటికీ కూడా; యెందుకంటే మనిషి ప్రేమించడంలో ప్రేమించబడిన వ్యక్తి పట్ల గౌరవం వుండదు. తాన్యా పట్ల మా ప్రేమ అగత్యమైనది. ప్రేమించడానికి మాకు మరెవరూ లేరు గనుక."

-- 26 మంది పురుషులూ, ఒక అమ్మాయీ

"పూర్వకాలంలో యెన్ని మంచి విషయాలు వుండినాయో చూడు! యిప్పుడు యేమీ లేవు- మనుషులు లేరు, గొప్ప పనులు లేవు, కథలు లేవు -నీవు చెప్పలేవు. నీకేం తెలుసు? మీ యువకుల్లో యెవరికైతే యేం తెలుసు? గతాన్ని రేఖలకు పూర్వకాలం నాటి వాటితో పోల్చ దగినవి యేమీ లేవు. యెందుకు? చెప్పుమరి. అం. శోదిస్తే జీవిత సమస్యల కన్నిటికీ జవాబులు దొరుకుతాయి, కానీ మీ రావని చేయరు. అందువలన మీకేమీ తెలియదు. యేమి జరుగుతున్నదో నేను గమనించలే ననుకున్నావా? యెంతో బాగా గమనిస్తున్నాను. కండ్లు బలహీనమైనప్పటికీ, మనుషులు జీవించడానికి బదులు జీవితానికి సిద్ధం కావడంలో తమ ఆయుస్సంతా గడిపేస్తున్నారు. అలా కాల మంతా వ్యర్థం చేసి, అంతా పోగొట్టుకున్న తర్వాత, విధిని నిందిస్తారు. విధికేమి సంబంధం? ప్రతి వొకడూ యెవని విధి వాడే. యీ నాడు ప్రపంచంలో అనేక రకాల మనుషులు వున్నారు, కానీ బలంగల వాళ్లు లేరు. యేమైనారు వాళ్ళు? యిక అందమైనవాళ్లు దినదినానికీ తగ్గిపోతున్నారు."

-- ముసలి ఇజెర్గీల్

"తల్లి సృష్టిస్తుంది, తల్లి రక్షిస్తుంది, విధ్వంసం గురించి ఆమెతో మాట్లాడడమంటే ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడడం; కానీ అది తెలియదు అతనికి, ఆమె మనుగడకు గల కారణాన్ని తొలగిస్తున్నానని తెలియదు అతనికి.

తల్లి యెప్పుడూ మృత్యువుకు వ్యతిరేకం; మనుషుల సంసారాలలోకి మృత్యువును కొనితెచ్చే చేయి అంటే తల్లులకు ద్వేషం, రోత. కానీ కొడుకు యిది గమనించలేదు, హృదయాన్ని జడం చేసే ముష్కర కీర్తి ధగద్ధగలతో అతని కండ్లు చెదిరినాయి.

తల్లి యెంత నిర్భీతిగా వుండగలదో అంత యుక్తిగానూ, అంత నిర్దయగానూ వుండగలదు తాను సృష్టించి పోషించే జీవానికి ప్రమాదం యేర్పడినప్పుడు, అనే విషయంకూడా అతనికి తెలియదు."

-- ఇటలీ గాథలు

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

మరీచిక