Posts

Showing posts from May, 2026

"కథంబం"- నేను చదువుతున్న పుస్తకం

Image
నేను చదువుతున్న పుస్తకం  'కథం'బం కథా సంకలనం ✍️ ఒకరా... ఇద్దరా... ఇరవై మంది రచయితలు. 1950 నుంచి మొదలుపెట్టి, 2005 దాకా చేసిన కథలు. ఆ కథల్లో రకరకాల జీవితాలు... అనుభవాలు. గ్రంథాలయం వెళ్లే అలవాటుంటే మీకూ ఎక్కడో తారసపడకపోదు ఈ పుస్తకం. దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. ఇంటికి తీసుకుని వెళ్లి చదివి ఆనందించండి. ఆణిముత్యాల్లోంచి నేను ఏరిన కొన్ని శకలాలు మాత్రమే ఇవి... ✍️ కోర్టు రమను ప్రశ్నించింది. 'నీ కులం ఏమిటి?' 'మాదిగ' 'మతం?' 'హిందువు' 'క్షత్రియ కాదా?' 'కాదు' 'తండ్రి కులం కూతురి కులం అవుతుంది కదా!' అది ఎవరైనా చెప్పేమాటే. న్యాయస్థానం, న్యాయవాదులు, న్యాయమూర్తులు అలోచించి వాస్తవం గుర్తించి ప్రకటించి తీర్పు చెప్పాలి. 'భార్యనో ఉంపుడుగత్తెనో కడుపుచేసి వదిలేసిపోయి, పుట్టినబిడ్డను చూడని, పెంచని, పోషించని, పెళ్ళిచేయని కట్నకానుకలివ్వని, మనిషెవరో తెలియని వాడు కూడా తండ్రేనా?' 'తండ్రే!' క్షేత్రం, బీజం మీద చాలాసేపు ప్రశ్నోత్తరాలు, వాదోపవాదాలు జరిగాయి. ఏమీ తేలలేదు. -- రమ నా కూతురు, 2005, కొలకలూరి ఇనాక్ ---- ✍️ "యీ చెంబూ, లక్డ...

కదలాలంతే

Image
చలనమే ప్రాణం చలనమే జీవం శ్వాస శబ్దమై మోగాక ఒళ్ళు అలలుగా ఎగిశాక ఇక అదుపు లేదు అలుపు అసలు రాదు ఆకాశాన్ని అందడమే జయగీతికగా మారడమే ముని ✍️ చిత్రం: చిట్టత్తూరు లాస్య

నువ్వు మాత్రమే లేవు

Image
‘చెప్పండి నా...’ రాత్రిపూట అక్షరం కాలేక నిన్ను తడిమితే మెత్తటి గొంతు...  ఆపైన రేపటి ఉదయం చిలుకకొయ్యకు తగిలించడానికి నువ్వు నేసే వార్తల వంతు *   *   * యుద్ధంలానూ... శాంతిలానూ...  ఏకకాలంలో ఎలా సాధ్యమో అసలు చల్లటి చిరునవ్వు మాత్రమే చూశాము కానీ లోలోపలే తెగి ముక్కలుముక్కలుగా రాలుతున్న చప్పుడు నీ భార్యాబిడ్డలైనా వినగలిగారా? *   *   * ఇంతగా ఏకాంతాన్ని కౌగిలించుకున్నావని లోలోపలే ఉండలుఉండలుగా చుట్టుకుని పోయావని నీ చుట్టూ ఆవరించిన సమూహత పసిగట్టే ఛాన్సే ఇవ్వలేదు కదా పువ్వు మెత్తగా విచ్చుకోవడం చూడలేదు నేను కత్తిలా దిగబడ్డప్పుడు మాత్రం నువ్వై కనిపించావు *   *   * నిన్ను నీలోకి దాచేసుకుని ఎవరెవరివో కన్నీళ్ళు భుజాన మోసుకుని నడుస్తూ నడుస్తూ రోడ్డు మలుపులో మాయమైపోతావని ఇక ఎదురుచూపులు లేనేలేవని తెలిసే వుంటే... ఆయమ్మ కన్నీళ్ళు నిలబెట్టి వుండేవేమో *   *   *  అవును, నువ్వొక పరిచిత అపరిచితుడివి అందరూ వున్న అనామకుడివి సుపరిచిత దారుల్లో కదులుతున్నట్టే అనిపిస్తూ విడిచిపెట్టిన వొయాశిస్సుకోసం వెదకులాడే ఎడారి పథికుడివి *...

చీరకట్టు

Image
భారతీయత చీరలోనే లేదు నిజమే... కాదనేది ఎవరు? అసంకల్పిత గౌరవం మాత్రం ఆ "కట్టు"కే కట్టుబడుతుంది నిండైన సంప్రదాయ రూపం మోహాన్ని పడగొడుతుంది ఆత్మీయతను రంగరించి అనురాగాన్ని నిలబెడుతుంది చిత్రం: చిట్టత్తూరు లాస్య

సౌందర్యం

Image
లేమి అలంకారాలదే కానీ సౌందర్యానిది కాదుగా లోలోపలి తెలి వెన్నెల పెదవులపై విరబూశాక పక్షులు, పువ్వులతో మనసు ప్రకృతియై పరిమళిస్తుంది దేహ స్పృహ నశించి ఆత్మసౌందర్యం ప్రకాశిస్తుంది చిత్రం: చిట్టత్తూరు లాస్య

కాపీనం

Image
"ఇగ్గో ఈడనుంచీ, అగ్గో ఆడ రైలు పట్టాలకానుకోని కనిపిస్తా వుండ్లా, ఆడదాకా పచ్చగా చేలే. పుట్లు పుట్లు పండిస్తి ఈ చేతుల్తోనే. ఈ బారలతో జవిరి ఉడ్డేసి, మూటలుకట్టి బండ్లకెత్తి నానబయా” రెక్కలు చాపాడు.  పురాణాలు, జానపద కథల్లో చదవడం తప్ప ఆజానూబాహుడంటే ఎలా ఉంటాడో పురుషోత్తం ఇదివరకు చూడలేదు. డెబ్బయ్యేళ్లు దాటుతున్నా మెలితిరిగి కనిపిస్తున్న ఆ ముసలాయన చాపిన రెక్కలను చూస్తున్నాడు ఇప్పుడు. కరెంటు స్తంభానికి కట్టేసిన ఆవు, సత్తు బక్కెట్లో పోసిన కుడితి తాగుతోంది. అర్ధాంతరంగా ఆపేసిన అసంపూర్తి బిల్డింగు గోడకు వాలుగా కట్టిన చిరుగుల టార్పాలిన్ సపార కింద కూలబడ్డ రెండో ఆవు, తన ముందేసిన జొన్న కట్టిని కన్నెత్తి చూడకుండా అరమోడ్పు కళ్ళతో తీరిగ్గా నెమరేస్తా ఉండాది. ట్రాక్టరును కడిగినారో ఏమో, బైపాస్ రోడ్డు నుంచి పురుషోత్తం ఇంటిదాకా పదడుగుల వెడల్పుతో వేసిన సిమెంటు రోడ్డు మింద నీళ్ళు కాలవలై పారుతోంది. పొద్దు పది దాటుతోన్నా, మంచు దుప్పటి తొలగించి ముఖం చూపించడానికి సూరీడయ్య బద్ధకిస్తా వుండాడు. “డ్డోయ్... మళ్ళిట్టా...” కాంతారలో హీరో కేకకు కూడా పురుషోత్తం జడవలేదు. వినిపించిన అరుపుకు అదిరిపడి చూసేసరికి, కట్టు తెంపుకుని...

రోదన రక్కసి

Image
పడకలమీద అసహనంగా కదులుతున్నారు విక్రమపురి వాసులు. ఎక్కడినుంచో హృదయ విదారక రోదన. అసహాయురాలైన ఓ స్త్రీమూర్తి ఎవరో అంతులేని విషాదంలో కూరుకున్నట్లు. తప్పించలేని ఆపదేదో మీద పడ్డట్టు. గత కొద్ది రోజులుగా ఇదే రోదన, గుండెలు పిండేసేలా. ఎక్కడినుంచో తెలియడం లేదు. ఎవరు ఎందుకు రోదిస్తున్నారో అర్థం కావడం లేదు. ఝాములను సూచించే నగారా రాత్రి పన్నెండు సార్లు మోగగానే శూన్యంనుంచి తెరలు తెరలుగా గాలి అలలపై తేలి వస్తున్న ఆ రోదన భరించలేక పోతున్నారు నగర వాసులు. రాత్రుళ్ళు నిద్ర లేక, అందువల్ల వచ్చి పడుతున్న నీరసంతో పగళ్లు పనులు చేసుకోలేక సతమతమై పోతున్నారు. నిజం... తమ రాజ్యానికేదో కీడు దాపురించింది. ఏదో ముప్పు వాటిల్లనున్నది. అందుకు సూచనగానే ఈ శూన్య రోదన.  ఎప్పుడు ఏ గండం వచ్చి పడుతుందోనని భీతిల్లి పోతున్నారు రాజ్య ప్రజలు. రాత్రి గడిచినది. ఉదయము రాజసభ కొలుఫుదీరినది. "మహామంత్రీ..." గంభీరంగా పిలిచాడు మహారాజు విక్రమసింహుడు. ఆయన వదనం వాడి ఉంది. "ప్రభూ..." ఉచితాసనం నుంచి లేచి నిలబడ్డాడు మహామంత్రి తిమ్మనామాత్యులు. "నేటికి మాసము దినములైనది... ఆ శూన్య రోదన వినిపించడం ప్రారంభమై. ఏమీ చేయలేక పోతున్నామ...