నేను చదువుతున్న పుస్తకం- నల్లమిరియం చెట్టు
❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️
👉 నల్లమిరియం చెట్టు
రచయిత: డా. వి.చంద్రశేఖరరావు
“దళితులంటే, ఒక కేటగిరి. తప్పనిసరి కోటా. పేదవాళ్ళకంటే హీనమైన కేటగిరి. నేను మధ్యతరగతి మనిషిని, రాజకీయ నాయకుణ్ణి, Z.P.ఛైర్మన్ని ఇవేం నిజం కావు. నేను దళితుడన్నదే నిజం".
“రాజకీయంగా, నాకు కొన్ని కమిట్మెంట్లు ఉన్నాయి. ఐడియా లున్నాయి. కానీ నేను దళితుణ్ణి. నా స్వంత ఆలోచనలు చేయటం నిషిద్ధం. పార్టీ చెప్పిన మాటకు తల ఊపే గంగిరెద్దుని నేను. పెరట్లో కట్టివేసుకున్న కుక్కను”. పార్టీలో, ఆఫీసులో, నాది దళిత ముఖం. నన్ను రిఫర్ చేస్తూ అందరూ ముఖం చిట్లిస్తారు. నేను దళితుల ప్రతినిధిని అని ప్రకటిస్తారు. నన్ను మూలాల నుంచి వేరు చేస్తారు. నేనొక మాస్క్ ను”.
"ఇక్కడ దళితుడిగా జీవించటమంటే భయం గొలిపే ఒంటరితనం".
-- నల్లమిరియం చెట్టు

Comments
Post a Comment