ఎన్నైనా అనండి
❤️ ఎన్నైనా అనండి! ❤️
తాతలుండేవాళ్ళు వీధి అరుగుపై
విశ్రాంతికి రూపునిస్తూ
పెరళ్ళుండేవి పచ్చపచ్చగా
అలిసిన ప్రాణాలను సేదతీరుస్తూ
చేదబావులుండేవి చలచల్లగా
డస్సిన గొంతులో తియ్యటి జలాన్ని చిలకరిస్తూ
కాలాన్ని వెనక్కి తిప్పాలనుకోడం...
చాదస్తమైతే కావచ్చు
కాలాన్ని గెలిచేద్దామని పరుగులు పెట్టడం...
మూర్ఖత్వం అవునా కాదా!
మీరు ఎన్నైనా అనండి
ఇంత చద్దిమూట భుజానేసుకుని
నింపాదిగా జీవితాన్ని దాటడం రానంత వరకు
డిప్రెషన్ల మూకుమ్మడి ముట్టడిలో బతుకులు
బరస్ట్ అవుతూనే ఉంటాయి
అహంకార క్షిపణి దాడుల్లో సామ్రాజ్యాలు
గల్లంతవుతూనే ఉంటాయి
👉 చిత్రం: లాస్య

Comments
Post a Comment