నేను చదువుతున్న పుస్తకం.. బొలీవియా డైరీ

 


❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️

👉 బొలీవియా డైరీ (1966 నవంబరు 7 - 1967 అక్టోబరు 7)

రచయిత: చే గువేరా (గెరిల్లా పోరాటకాల రోజువారీ అనుభవాలు)


"... మరి కాసేపటికే ఒక సైనికుడు మాకు ఎదురువచ్చాడు. అతనితోపాటు మూడు జర్మన్ వేటకుక్కలు, ట్రెయినరు కూడా ఉండడంతో మేం నివ్వరపోయాం. వాళ్ళు మమ్మల్ని వదలరని అర్థమైపోయింది. ముందుకు మీదకు వస్తున్నారు. నేను ముందుగా వస్తున్న కుక్క మీదకు గుండు పేల్చా, గురితప్పింది. ట్రెయినర్ మీద గన్ను గురిపెట్టా. తుపాకి 'జామ్' అయిపోయింది. మిగ్యుయెల్ ఒక కుక్కని చంపాడు. ఇంకెవరూ ఉచ్చులో పడలేదు. సైనిక పటాలం మీద ఆగాగి తుపాకులు పేలాయి. కాల్పుల శబ్దం ఆగిపోగానే మన వాళ్ళను వెనక్కి వచ్చెయ్యమని పిలుచుకు రావడానికి ఆర్బానోను పంపాను. తను వెళ్ళి వచ్చి రోలాండో గాయపడ్డాడనే వార్త చెప్పాడు. మరికాసేపటికి అతన్ని తీసుకువచ్చారు. అప్పటికే అతని ఒంట్లోంచి చాలా రక్తం పోయింది. మనిషి చాలా వేగంగా కృశించిపోతున్నాడు. మేం అతనికి ప్లాస్మా ఇవ్వనారంభించాం. అంతలోనే అతను మరణించాడు. తుపాకి గుండు అతని తొడ ఎముకని, నరాలు, కండరాల వ్యవస్థని చిన్నాభిన్నం చేసింది. మేం ఏదన్నా చేసేలోపే  అతను రక్తమోడుతూనే అలా కన్ను మూసాడు. మా దళంలో మెరికలాంటి గెరిల్లాను కోల్పోయాం. సహజంగానే మా ఉద్యమానికి మూలస్తంభం లాంటి ఒకరిని పోగొట్టుకున్నాం. అతను బాల్యం నుండి నా సహచరుడు. తొలుత అతను వార్తాహరుడిగా పనిచేసాడు. తరువాత గెరిల్లా వీరుడిగా రాటుదేలాడు. ఇప్పుడు ఈ విప్లవకర సాహసకృత్యంలో భాగస్వామి అయ్యాడు..."

 -- బొలీవియా డైరీ, చే గువేరా


"చే దగ్గర చేజిక్కించుకున్న రెండు ఎరుపు రంగు స్పైరల్ నోటు పుస్తకాలు, చెర్రీ రంగు ప్లాస్టిక్ కవర్లో ఉన్న 1967 అజెండాను, పశ్చిమజర్మనీలో ప్రచురించారు. దీంతో యూరప్, అమెరికా దేశాల్లోని ప్రచురణకర్తలు ఆ డైరీలు ప్రచురించడానికి పోటీలు పడ్డారు. బొలీవియా ప్రభుత్వం ప్రచురణ హక్కుల మీద వివాదం లేవనెత్తింది. అమెరికాలో పేరు మోసిన ఒక ప్రచురణ సంస్థ బేరియాంటోస్తో నాలుగు లక్షల డాలర్లకు ఈ డైరీలు ముద్రించే హక్కుల కోసం బేరం కుదుర్చుకుంది. ఈ బేరసారాలు నడుస్తుండగానే 1968 జూలై నెలలో క్యూబా ప్రభుత్వం హఠాత్తుగా చే డైరీలను సంపూర్ణంగా, కాస్ట్రో ఉపోద్ఘాతంతో ప్రచురించాయి. స్పానిష్ భాషలో ప్రచురించిన ఈ పుస్తకం ఆ వెనువెంటనే ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం అయింది. దాంతో బొలీవియా డైరీ అంతర్జాతీయంగా ఉత్తమ అమ్మకాల పుస్తకాల జాబితాలోకి చేరింది."

-- పుస్తక పరిచయం చేస్తూ... జాన్ లీ ఆండర్సన్


విప్లవక్రమంలో మరణం సహజ సంభవం అని చే దృష్టి పథాన లేకపోలేదు. అంతమాత్రాన లాటిన్ అమెరికా దేశాల్లో విప్లవ ప్రస్థానం వెనుకపట్టు పట్టదని చే రేఖామాత్రంగా ఈ పుస్తకం చివరి పేజీల్లో స్పష్టం చెయ్యడానికి ప్రయత్నించాడు. తృతీయ ఖండ దేశాల సదస్సుకు పంపిన సందేశంలో కూడా అదే విషయం పేర్కొన్నాడు.

"మన కార్యాచరణ ప్రతీదీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఎక్కుబెట్టిన యుద్ధ సింహనాదమే... ఈ క్రమంలో మనల్ని మృత్యువు పలకరించవచ్చు. అయినా మనం దాన్ని స్వాగతిద్దాం. మన యుద్ధనాదం సోకాల్సిన చెవికి సోకి ఇంకో చెయ్యి ఇంకో చెయ్యి ఆయుధం అందుకోవడానికి ముందుకు వస్తుంది' అన్నాడు చే."

-- అవశ్య ఉపోద్ఘాతం పేరుతో ముందుమాట రాస్తూ... ఫైడెల్ కాస్ట్రో (1968)

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

మరీచిక