చెరువుకట్టమీద
ఎగిరిపోతున్న పిట్ట ఒకటి
తీయటి పాట వినిపిస్తుంది
కదిలిపోతున్న గాలి తెమ్మెర
కాస్త ఆగి వీవన పడుతుంది
మంద్రంగా అలల గలగలల సడి
సంగీత సాధన చేస్తుంది
సంధ్యాకాశం ముద్దులో నీటికన్నె బుగ్గ
సిగ్గుపడి ఎర్రబారుతుంది
ఆద్యంతాలు లేని లోకమేదో
కట్టెదుట ఆవిష్కృతమవుతుంది
ఆ చెరువు కట్ట మీద కాలం ఘనీభవించి
అనిర్వచనీయ శాంతిలోకి మనసు జారుతుంది
ముని ✍️
(కుప్పం డీకే పల్లె చెరువు, నీటితో నిండిన సమయంలో.. కట్ట మీద నిలబడినప్పుడు నేను పొందిన అనుభూతి స్మృతిలో..)
Comments
Post a Comment