పునరపి జననం
సరిహద్దుల్లో సాయుధమవడం
మృత్యువుకు సవాల్ విసరడమే
నీది మరణం ఎందుకవుతుంది?
జాతి గుండెల్లో పునరపి జననం కానీ
భరతమాత నుదుటి సింధూరమై
భగభగ మెరుస్తున్న సూర్యుడా..
నీ పాదాలను ముద్దాడుతున్నాం
గడగడలాడుతున్న శత్రువు సాక్షిగా
బిగిసిన పిడికిళ్ళమై శాల్యూట్ చేస్తున్నాం!
ముని ✍️
Comments
Post a Comment