దెయ్యంలా పట్టిన పిచ్చి

మొన్న- ఎర్రచందనం స్మగ్లర్ వేషం వేసిన సినిమా  హీరో..
నిన్న- ఏడుకొండలమీద కొలువైన దేవుడు..
నేడు- ఎవరికోసమో తెలియని ఆటలో నెగ్గిన జట్టు..
దర్శనం చేసుకుని తరించడానికి గుంపులు కట్టిన జనం..
తొక్కుకుంటూ తోసుకుంటూ.. ఊపిరాడక నలిగిపోతూ
ఒకరూ ఇద్దరూ కాదు.. పదుల సంఖ్యలో దుర్మరణం..
పిచ్చి కాకపోతే ఏమిటిది..
'దేవుడా రక్షించు నా దేశాన్ని'- అని సైతం అనలేకపోతున్నా..
ఆయన పేరుతో ప్రవచనకారులు వెఱ్ఱివాళ్లనే ప్రోత్సహిస్తున్నారే..
'నాయకులారా రక్షించండి నా ప్రజలను' - అందామన్నా నోరు రావడంలేదు..
ఆ నాయకులే సన్మానాలు చేసి మరీ ఈ పిచ్చిని పీక్ కు తీసుకు వెళ్తున్నారే..
వీళ్ళను ఎవరు కాపాడాలి!
ఎవరు.. జనాన్ని దెయ్యంలా పట్టిన ఈ పిచ్చిని వదలగొట్టాలి!?
(నిన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ గెలిచిన ఆర్సీబీ ఆటగాళ్లను చూసేందుకు పోటెత్తి మృతువాతపడ్డ వెర్రి అభిమానుల గురించి విని వేదనతో...)

ముని ✍️

Comments

Popular posts from this blog

పుట్టింరోజు

మొగలాయి అంగట్రాజెమ్మ

తాగని టీ