ఊరి చివర
పిట్ట ఒకటి స్వేచ్ఛగా
రెక్క విప్పి ఎగురుతుంది
కొబ్బరిచెట్ల వరుస ఠీవిగా
ఆకాశానికి తలయెత్తుతుంది
పైరు కన్నె ముసిముసిగా
పచ్చిగాలి పైట విసురుతుంది
మట్టిగట్టు బిడియపడుతూ
మెలిక తిరిగి సాగుతుంది
పెంకుటిల్లు మౌనిలా
ఏకాంతమై తపస్సు చేస్తుంది
ఊరి చివర దూదిపింజలా
మనసు తేలి సేదతీరుతుంది
ముని ✍️
Comments
Post a Comment