చందమామ
"నక్క విందు" కథ తెలుసా మీకు.
అప్పుడప్పుడే అక్షరాలు నేర్చుకునే రోజులు. మా ఊరి ఇస్కూల్లో నాలుగో తరగతి చదవతా ఉండే నేనే మొగలాయి తెలుగు చదవడం, డిక్టేషను రాయడంలో. మా జయమ్మ మేడంకు నేనంటే అందుకే చాలా ఇష్టం.
అప్పుడు "బాలచంద్రిక" అనే మంత్లీని మేడమ్ తనతోపాటు తెచ్చేది. అడగతానే నాకు ఇంటికి ఇచ్చేది. కొత్త పుస్తకం వాసన ఎంత కమ్మగా ఉండేదో. నేనూ, నా క్లాసే చదువుతున్న మా అక్క ఇద్దరం ఆ పత్రిక ముందేసుకొని ఒకటే చదవడం.
అప్పటి ఆ ఆనందం అంతాఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ తిరిగీ రాదు.
అదిగో ఆ బాలచంద్రికలో నేను తొలిసారి చదివిన కథ "నక్క విందు".
తర్వాత "చందమామ"కు అప్గ్రేడ్ అయింది నా కథల చదువు. దానితోపాటు బాలమిత్ర, బాలచంద్రిక, బుజ్జాయి.. ఎన్నేసి కథల బొమ్మల పుస్తకాలో. ఆపైన మరెన్నో కథలు.. నవలలు.. బోలెడు చదివి పడేశాను. ఇంకా పడేస్తున్నాను కూడా.
కానీ చందమామ ఇచ్చిన మత్తు మరేదీ ఇవ్వలేదు. విచిత్రమైన సాహస, మాంత్రిక, నీతి గాథలు.. పేజీపేజీకి కనిపించే రంగురంగుల బొమ్మలు అద్భుత లోకాల్లోకి తీసుకెళ్లి పోయేవి.
ఆ పత్రిక ముఖ చిత్రం ఒక అబ్బురమే.
ఏదో వాట్సాప్ గ్రూప్ లో వచ్చిన అక్టోబర్ 2012 నాటి చందమామను చూశాక మనసు అంతకన్నా పాతరోజులు ఎనభయిల్లోకి వెళ్ళిపోయింది.
చీకూచింతా లేని లేని కథల బాల్యంలోకి పరుగులు తీసింది మనసు.
అప్పట్లో చందమామ ముఖ చిత్రకారుడు ఎవరో తెలుసా మేము పూర్తిపేరు తెలుసా మీకు..?
తెలిస్తే చెప్పేయండి మరి వెంటనే.
దానితోపాటు మీ చందమామ అనుభూతులూ పంచుకోండి.
Comments
Post a Comment