కుందేలుమామ తెలివి
అనగనగా ఒక అడవిలో ఒక సింహరాజు ఉండేవాడు. చాలా మంచి వాడైన ఆ రాజు పాలనలో జంతువులన్నీ సుఖసంతోషాలతో జీవించేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆ అడవి రాజ్యానికి ఎక్కడినుంచో ఒక బలిసిన యువ సింహం వచ్చింది. ఆ యువ సింహం చాలా పొగరుగా ఉండేది. కుందేళ్ళు , జింకలు వంటి బలహీనమైన జంతువుల పట్ల దురుసుగా ప్రవర్తించేది. అప్పుడప్పుడూ చాటుగా వాటిని వేటాడి తినేసేది కూడా. అంతేకాదు , ఇప్పుడున్న రాజు వృద్ధుడైపోయాడని , అడవి రాజ్యాన్ని , అందులోని జంతువులను ఇతర ప్రాంతాలనుంచి వచ్చే క్రూర జంతువులనుంచి అతడు రక్షించలేడని అక్కడక్కడా అది వాగడం మొదలుపెట్టింది. విషయం గద్ద వేగుల ద్వారా తెలుసుకున్న సింహరాజుకు దిగులు పట్టుకుంది. పొగరుబోతు యువ సింహాన్ని ఎదిరించేది ఎలాగో తెలియక తల పట్టుకుంది. ఒకరోజు సింహరాజు దిగులుగా ఉన్న సమయంలో నక్క మహామంత్రి ఆయన దగ్గరకు వచ్చింది. " మహారాజా , ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ?" అని దిగులుగా ఉన్న సింహరాజును నక్క మహామంత్రి అడిగింది. పేరుకు మంత్రే కానీ ,, నక్క కూడా జిత్తులమారిది. అప్పుడప్పుడూ సింహరాజు శత్రువైన యువ సింహాన్ని రహస్యంగా కలిసి వచ్చేది. ఈ నిజం కూడా సింహరాజుకు వేగుల ద్వారా తె...