కాదేదీ కుంచె కనర్హం
రాలుతున్న ఆకులు, పూవులు... వికసించిన కలువ కొలను... పశువులను కాస్తున్న కన్నెపిల్ల... లయవిన్యాసాల నాట్యగత్తె... సొగసులతోపాటు గాంభీర్యాన్ని ఒలికే యువరాణి... మానవ దేహంలో నిబిడీకృతమైన షట్చక్రాలు... ఒకరికి ఒకరై పశువుపై కొలువైన గొల్ల జంట... బండివెంట సాగుతున్న పడచులు... నీలాటి రేవులో నీళ్ళకొచ్చిన కన్నెపిల్ల... అనంత నీలంలో మునిగిన మహాశివుడు... అంతటి శివుడినే పాదాలకింద తొక్కిపట్టిన కాళిక... ప్రకృతిలో లయమై అనంతమైన శాంతిని ప్రసాదించే శరణాగతుడు... ఆలయం ఆవరణలో నడచి వెళ్తున్న మహిళ... పల్లెటూరి రచ్చబండమీద తీరి కూర్చుని ముచ్చట్లలో పడ్డ పెద్దమనుషులు... అసలక్కడ ఏ రూపు ఉందో అర్థమయ్యీ కానట్టు అనిపించే బోలెడు నైరూప్య చిత్రాలు... తంజావూరు పౌరాణిక పాత్రలు... రవివర్మ వన్నెలు...
ఒకటా రెండా... అదో అనంత కళాసాగరం. సొందర్యాత్మక ఝరీపాతం... నిలువెల్లా పులకింతలు కురిసే మురిపెంపు ఆనంద కైవారం.
ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మెచ్చు తునకలు ఇంకా ఎన్నో.
కాదేదీ కుంచెకు అనర్హం.
17.01.2026
శనివారం
నేను ఒక ఆర్ట్ గ్యాలరీ చూడడం ఇదే మొదలు. అది కూడా నాకోసమని కాక మా లాస్యా పాపకోసమే మేము వెళ్ళింది. మేము అంటే... వాళ్ళ అమ్మ వీణ, బాబు నాద్, మా బావమరిది కుమారుడు గగన్. కానీ రసానందంలో మునిగింది పాపతోపాటు నేను కూడా.
రస హృదయం ఏమాత్రం ఉన్నా... మీరూ వెళ్లి చూడండి.
👉 కర్ణాటక చిత్రకళా పరిషత్ ఆర్ట్ గ్యాలరీ, బెంగళూరు.
తొలుత ఇక్కడ ఫైనార్ట్స్ డే కాలేజీ కూడా ఉండేది. ఇప్పుడా కాలేజీని "కెంగేరి, బెంగళూరు" కు మార్చారు. ఇప్పుడిక్కడ ఆర్ట్ గ్యాలరీతోపాటు మ్యూజియం కూడా ఉంది. ఈవెనింగ్ శిక్షణా తరగతులు నడుస్తున్నాయి.
ముని ✍️
Comments
Post a Comment