Posts

Showing posts from February, 2026

"Remote" control

Image
      నా ముద్దుల కుమార్తె లాస్య చిట్టత్తూరు గీసిన పెన్సిల్ స్కెచ్ ఇది. హాలులో వాళ్ళ నానమ్మ చేతిలో రిమోట్ పట్టుకుని తదేకంగా టీవీ సీరియల్స్ చూసే దృశ్యాన్ని, ఆ పక్కనే ఉన్న డైనింగ్ ప్లేస్ తో సహా బంధించింది. నానమ్మ ముందున్న దివాన్ ను, ఆమె మెడలోని ముత్యాల హారాన్ని కూడా వదల్లేదు.      ఈ స్కెచ్ కు నేను "Remot" control అని పేరు పెట్టాను.      పాప వేసిన చిత్రమా... లేక ఆ చిత్రానికి నేను పెట్టిన పేరా... ఏది  బావుంది?

పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా

వద్దనుకుంటూనే ఉంటాను వినని వేళ్ళు లోలోపలికి చొచ్చుకుని పోతాయి ఇన్ని ఇసుక రేణువులనో ఇంత మట్టి పరమాణువులనో జవురుతాయి ఇకప్పటినుంచీ తలపోత జలజలా రాలిపోతున్న వేటినో ఒడిసిపట్టాలన్న తాపత్రయం బతుకు బతుకుకూ ఈ యాతన లేకపోతే నువ్వున్నా లేనట్టేనట ఎక్కడినుంచో ఒక సుగంధమేదో వీస్తుంది ఇటుపక్కనెక్కడో ఎండిన పువ్వొకటి రాలుతుంది ఏది నిజమో తెలియదు రాత్రంతా గుచ్చుకున్న కలలు చిరుచీకట్ల తెల్లారగట్ల ఏమవుతాయో కనిపించవు పక్క తడిసింది కురిసిన చినుకులతోనా కాగిన కన్నీటి చుక్కలతోనా దూరంగా ఒక ఆకాశం తెల్లబోయి చూస్తున్న చందమామతో పనేమి తప్పించి వొంపుకున్నాను ఎగిరిపోబోతున్న చుక్కలన్నీ పలపలా మెరిశాయి ఎక్కడో జారిపోయిన రెక్కల్ని తడుముకున్నాను ఇక్కడిదాకా మోసుకొచ్చింది భారాన్నా లేక గాయాన్నా బహుశా తేడా లేదేమో... నిజానికి ఉన్నదేమో కూడా వాడికేం... అలా నవ్వుతూనే ఉంటాడు విరగ్గొట్టిన పాటల్ని అతుక్కోవాల్సింది నేను కదా ఇప్పటికైనా గుప్పెడు పొగడపూలను ఏరుకోవాలి ఇన్ని చెమటచుక్కల్ని పూసి పదునుగా పేనుకోవాలి నడిచొచ్చిన దారుల్లో నన్ను నేను వెదుక్కుంటూ వెలుతురు గొంతు నులిమేసిన చీకట్లకోసం బోలెడన్ని ఉరికంబాలను చెక్కుకోవా...

ద జర్నీ

ఊగుతూ తూగుతూ వెళ్తున్న బస్సులో ఆపాటి కదలిక కూడా ఆగిపోయింది. అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న నేను డ్రైవరువైపు చూశాను విసుగ్గా. అతడికి కళ్ళు నిలువుగుడ్లు పడున్నాయి. ఊపిరి ఆడనట్లుగా ఎగశ్వాశ తీస్తున్నాడు. ఎదురుగా రోడ్డు మీదకు చూస్తున్నాడు. నేను అప్రయత్నంగా అటు తల తిప్పాను. ఎవరో ముసలి వ్యక్తి. రోడ్డుకడ్డంగా నిలబడి బస్సు ఆపమన్నట్టు చేయి ఊపుతూ ముందుకొస్తున్నాడు. తెల్లటి పంచె , తలకు తువ్వాలు చుట్టి అచ్ఛం ఈ కుప్పం ప్రాంతం పేద రైతులాగే ఉన్నాడు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా దగ్గరిలో గ్రామాలేవీ లేవు. అది పలమనేరు దాటాక వచ్చే గుట్టలతో కూడిన అడవి ప్రాంతం. అప్పటికి అర్ధ రాత్రి పన్నెండున్నర అవు తోంది. కుప్పం నుంచి బస్సు బయలుదేరి రెండు గంటలు దాటింది. ఈ వేళప్పుడు , ఈ ముసలి రైతు ఇక్కడ ఎందుకున్నాడు ? దయ్యాలు , భూతాల మీద ఇక్కడి జనానికి నమ్మకం ఎక్కువ. అతడిని డ్రైవర్ దెయ్యమనే అనుకున్నాడా ? ఆ షాక్ వల్లే అలా అయిపోయాడా ? మళ్ళీ డ్రైవరు వైపు చూశాను. షాక్ నుంచి కాస్త తేరుకున్నట్టు కనిపిస్తున్నాడు కానీ , అతని ఒంట్లో వొణుకు మాత్రం తగ్గడంలేదు. " ఏం చౌడప్పా , బాగుండావా ? ఈమజ్జ మా నాయనూరు రూట్లో రావడం లేదేం...