"కాలా"తీతుడు కొడవటిగంటి
❤️ కాలాతీతుడు "కొడవటిగంటి" ❤️ నేను పదకొండో ఏట రజస్వల అయినాను. మరి మూడు నెల్లకు నా భర్త సన్నిపాతం వచ్చి చచ్చిపోయినాడు. సన్నిపాతం క్రిములవల్ల కలుగుతుందని శాస్త్రజ్ఞులు చెబుతారు. భార్యలు దుష్ట నక్షత్రాన రజస్వల అయితే భర్తలకు సన్నిపాతం వచ్చి మూడో వారంలో కొట్టేస్తుంది. ఈ రహస్యం దైవజ్ఞులకే తెలుసు... ఏమైతేనేం నేను కూడా ఒక హత్యకు కారకురాలైన దాన్నయినాను. యమధర్మరాజు కోర్టులో ఎప్పటికైనా నా మీద హత్యకేసు నడవకపోదు. ... ఇట్లా ఉండగా ఒకరోజు - నా పదమూడో ఏట - ఒక పెద్ద మనిషి - మా బంధుకోటిలో వాడే - ఎవరూ లేని సమయంలో నన్ను తన వొళ్ళోకి తీసుకొని, నా శరీరమంతా ఎంతో ప్రేమతో నిమిరి, నన్ను గట్టిగా తన రొమ్ముకు అదుముకుని, నన్ను ఉద్రేకంగా ముద్దులాడాడు. ఆయనను నేను ప్రేమించానని చెప్పలేను. ప్రేమను గురించి కథలలో చదువుతున్న కొద్దీ దాని స్వభావం ఏమిటో బొత్తిగా తెలియకుండా పోతున్నది. గమ్యస్థానం తెలియక దిక్కులేని పక్షిలాగా తిరుగుతున్న కామేచ్ఛ ఈ సంఘటనతో ఆయన మీద వాలింది. ఈ సంఘటన జరిగాక నా బాల్యం అంతమై యవ్వనదశ ఆరంభమైంది. నాకది ఒకవిధమైన రెండో పుటక. అనేక రోజులపాటు, నెలలపాటు, ఈ సంఘటన గురించే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా వొళ్ళు...