Posts

మరీచిక

“హెలో... స్వప్న గారా?” “కాదండీ , స్వప్న అనేవాళ్ళు ఇక్కడెవరూ లేరు.” “సారీ... నాన్నగారి ఫోన్ లో మీ పేరు మీద ఈ నెంబర్ ఉంటే చేశాను .” “ఎవరో ఆ నాన్నగారు ?” “శ్రీనివాస్ గారండీ.” “ఇంతకీ మీరెవరో ?” “ శ్రీనివాస్ గారి కొడుకుని. భరత్ నా పేరు.” “ఆహా... అలాగా. అయితే ఏంటట ? నేను స్వప్నను అయితే ఏమిటి ? కాకపోతే ఏమిటి ?” “మేడమ్ నేను విషాదంలో ఉన్నాను. స్వప్నగారు మీరేనా కాదా చెప్పండి. ఒకవేళ మీరు నేను అనుకున్న స్వప్నగారు   కాకపోతే సారీ.” ఎందుకో గొంతు కొత్తగా అనిపించింది స్వప్నకు. చెవి దగ్గర ఉన్న మొబైల్ ముఖం వద్దకు తీసుకు వచ్చి చూసింది. కాల్ శ్రీనివాస్ నుంచే.. సందేహం లేదు. అతని పేరే కనిపిస్తోంది. ఆట పట్టిస్తున్నాడు తనను. తగ్గకూడదు , తను కూడా ఆడించాల్సిందే. “ఆహా... అంతటి విషాదం ఏమిటో అబ్బాయిగారికి ?” “సారీ మేడమ్ , మీరు ఎవరో కానీ , కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఒకవేళ మీరే నేను అనుకుంటున్న స్వప్న గారైతే ఒక విషయం చెబుదామని ఫోన్ చేశాను.” “ఏమిటో ఆ విషయం ?” “శ్రీనివాస్ గారు పోయారు.” “ఆటలకైనా ఒక హద్దుండాలి శ్రీనివాస్. ఇటువంటి మాటలు ఇకెప్పుడూ వొద్దు. సారీ... న...

పరువు

అడవి కలివిపండు మాదిరి నల్లగా నిలగనిగలాడే బుగ్గలు లోతుకు వెళ్లిపోయాయి. చిన్న పిల్లోళ్లు కాగితం మింద బరబరా తీసిన పెన్సిలు గీతల్లా కళ్ళకింద చారలు తేలాయి. ఒత్తుగా రింగులు తిరిగి తుమ్మెదల గుంపులా మాటిమాటికీ మొగం మీదవచ్చి పడే జుట్టు పలచబడి నుదురును ఖాళీ చేసి వెనక్కి వెళ్ళింది. నల్ల కలువలాగా ఎప్పుడూ నవ్వుతో విరబూసి కనిపించే మొగం వాడి వేలాడిపోతోంది. ఆ కళ్ళనిండా ఏమిటవి.. ఎడారులా? లేక నడిచి వచ్చిన దారుల వెంట బతుకు నిండా అంటిన పల్లేరుగాయలా? ఆ పిల్ల ఈ పక్కే వస్తోంది. అంతటి ఎడారి ముఖంలోనూ ఏదో సంభ్రమం. కాలంలో తప్పిపోయిన మనిషి దొరికిన ఉద్వేగం. ఆ సంభ్రమం, ఉద్వేగం.. నన్ను చూసినందుకేనా? భయం వేసింది.. మామూలు భయం కాదది. సంఘ భయం. ఆ పిల్ల పలకరించి ఊరుకునే రకం కాదు. చాలా దగ్గరగా దాదాపు మీద పడిపోయినట్లుగా నిలబడుతుంది. నా రెండు చేతులనూ తన రెండు చేతులతో పట్టుకుని ఊపేస్తుంది. అన్నింటికీ మించి అయినదానికీ కానిదానికీ పకపకా నవ్వేస్తుంది. అంతేనా, ఎవరి గురించి చెప్పాలన్నా ఎదురుగా మనలనే ఆ మనిషిగా భావించి డైరెక్ట్ స్పీచ్ ఇస్తుంది. అంటే ఆ చెప్పదలచుకున్న మనిషిమీద ఉండే కోపం, తాపం, నిష్టూరం, కష్టం, ఇష్టం.. అన్నీ మనమ...

కుందేలుమామ తెలివి

  అనగనగా ఒక అడవిలో ఒక సింహరాజు ఉండేవాడు. చాలా మంచి వాడైన ఆ రాజు పాలనలో జంతువులన్నీ సుఖసంతోషాలతో జీవించేవి. ఇలా ఉండగా ఒకరోజు ఆ అడవి రాజ్యానికి ఎక్కడినుంచో ఒక బలిసిన యువ సింహం వచ్చింది. ఆ యువ సింహం చాలా పొగరుగా ఉండేది. కుందేళ్ళు , జింకలు వంటి బలహీనమైన జంతువుల పట్ల దురుసుగా ప్రవర్తించేది. అప్పుడప్పుడూ చాటుగా వాటిని వేటాడి తినేసేది కూడా. అంతేకాదు , ఇప్పుడున్న రాజు వృద్ధుడైపోయాడని , అడవి రాజ్యాన్ని , అందులోని జంతువులను ఇతర ప్రాంతాలనుంచి వచ్చే క్రూర జంతువులనుంచి అతడు రక్షించలేడని అక్కడక్కడా అది వాగడం మొదలుపెట్టింది. విషయం గద్ద వేగుల ద్వారా తెలుసుకున్న సింహరాజుకు దిగులు పట్టుకుంది. పొగరుబోతు యువ సింహాన్ని ఎదిరించేది ఎలాగో తెలియక తల పట్టుకుంది. ఒకరోజు సింహరాజు దిగులుగా ఉన్న సమయంలో నక్క మహామంత్రి ఆయన దగ్గరకు వచ్చింది. " మహారాజా , ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు ?" అని దిగులుగా ఉన్న సింహరాజును   నక్క మహామంత్రి అడిగింది. పేరుకు మంత్రే కానీ ,, నక్క కూడా జిత్తులమారిది. అప్పుడప్పుడూ సింహరాజు శత్రువైన యువ సింహాన్ని రహస్యంగా కలిసి వచ్చేది. ఈ నిజం కూడా సింహరాజుకు వేగుల ద్వారా తె...