ఆడినించేప్పా వొచ్చేది!


పగలు ఇక్కడ తెగకపోతే రాత్రుళ్ళు అక్కడ. బుజ్జగింపులు, తాయిలాల ఆశలు... అన్నీ అక్కడే. కుప్పం మున్సిపాలిటీ ఆశావహులు అక్కడికి క్యూ కట్టాల్సి వస్తోంది. ఇంతకీ ఈ పంచాయతీలు సాగుతున్నది ఎక్కడ?

15.10.26వ తేదీన ఆంధ్రజ్యోతి దినపత్రికలో నా రాజకీయ వ్యంగ్య కధనం👇


💚 "స్ధానిక" మేళం

👉 ఆడినించేప్పా వొచ్చేది!

''యాడినింకప్పా ఇంత మొబ్బులో (రాత్రి) వొస్తావుండావు?'

“ఆడినించేప్పా.”

“ఏందీ.. విలేజ్ లో ఉండాదే పెద్దాయన ప్లేసు, అట్నించా?'

''అవునప్పా, ఇంగెక్కిడినింకా అనుకున్నావు? నాకు నీ మాదిర్తో మొందు అలవాటు గూడా లేదుగదా, రాత్రిళ్లు బీళ్లు పట్టుకోని తిరగ ແລ.

'సర్లేప్పా, ఏమారితే ఎత్తిపొడస్తావు. ఏమంటా వుండారు వోళ్లు?'

'చెప్తాగానీ అక్కడికి నీకు పిలుపు రాలేదా.. అది జెప్పు ముందు.'

'నాకెందుకొస్తాది? వోళ్ల కళ్లల్లో నలుసు గూడా కాలేకపోతా వుండా గదా.?

'మొదుట్నుంచీ నాకే ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఆడికి పిలిపించు కోని.. ఎందుకు లేప్పా, కడుపు మంట.'

'ఏం జరగిందప్పా.. నీకు అడ్డాం పడతావుండేది ఎవరు?'

“ఎవురో ఒగర్లే. బలంతం జేస్తా వుండారు, పక్కకు తప్పుకోమని.'

'అయితే వొదిలేస్తావాప్పా?'

'ఎందుకు వదల్తా.. నామినేషన్లు ఈరోజునింకానే గదా. ఏసేది ఏసేదే. అనాక చూద్దాం ఏం జరగతాదో.'

'నన్ను లెక్కలోకి గూడా తీసుకోలేదు వోళ్లు. ఏమనుకుంటా వుండారో. నాగ్గనక పిలుపు రాకపోతే అప్పుడు జూపిస్తా నా తడాఖా.'

'వొస్తాది లేప్పా, రాకండా యాడ బోతాది. నేనెల్లినప్పుడు నిన్ను గురిచ్చే డిస్కషను జరగతా వుండాది. రేపైనా సరే, పిలిపిస్తారు జూడు.'

'నిజమేనాప్పా నువ్వు జెప్పేది? నేనొక క్యాండేటని గుర్తిస్తావుండా రన్న మాట. లేకపోతే ఏం జేస్తానో వాళ్లకు మాత్రం తెలియదా?'

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ స్థానాలకోసం పోటీ పడు తున్న ఏ ఇద్దరు అధికార పార్టీ ఆశావహులు కలిసినా వారి మధ్య ఇటువంటి సంభాషణే చోటు చేసుకుంటోంది. పొద్దుపోయాక సీని యర్ నాయకుడైన ఒక పెద్దాయన ఫామ్ హౌస్లో నాయకత్రయం కొలువుదీరుతున్నారు. ఆశావహులను పిలిపించి పోటీనుంచి విరమిం చుకోవాల్సిందిగా బుజ్జగిస్తున్నారు. ఇలా ప్రధాన పోటీదారుల్లో సుమారు ముప్పావువంతు మందికి ఫామ్ హౌస్ కు పిలుపొచ్చిందని సమాచారం.

- కుప్పం, ఆంధ్రజ్యోతి

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

పుట్టింరోజు