"స్థానిక" మేళం- ఈన కౌన్సిలర్ సార్!


'సార్ ఈళ్ల వార్డులో దొంగతనాలు ఎక్కవగా జరగతా వుండాయంట. చెప్పరా, నన్ను పరిచయం చెయ్యమంటూ ఓ అని తల దినేస్తివి గదా.'

'ఆ.. ఆ.. అవున్సార్. రేత్రిల్లో దొంగలు పడతా వుండారు. పగులు కూడా ఎవరూ లేంది జూసి, ఇళ్లల్లో జొరపడతా వుండారు.'

'నేను మా వాళ్లకు చెప్పి నిఘా పెట్టిస్తా లే.'

'కౌన్సిలర్ గదా సార్. జనాల కష్టాలు పట్టించుకోవాల.'

'ఎవుర్ని నా, కౌన్సిలర్ అంటా వుండారు. ఆయనకోసమే ఎదకతా వుండా. ఈడ గూడా లేడే' అంటూ మధ్యలో వచ్చిన ఓ కార్యకర్త అడి గాడు.

'నువ్వుండప్పా.. నేను జెప్తా వుండేది కాబోయే కౌన్సిలర్ గురించ్చి. రేపు ఈయప్పే గదా, పోటీ చేస్తావుండాడు. అందుకే సారుకు పరిచయం జేస్తా వుండా.'

'సరే. సరే.. రేపు ఆఫీసులో ఫ్రీగా ఉన్నప్పుడు కలవడండి. పని వుంది, వెళ్లాలి.'

'నమస్తే సార్. అట్టాగే సార్.'

కుప్పంలోని ఓ ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. ఇంతకీ ఏం జరిగిందంటే. అనారోగ్యంతో ఉన్న ఓ అధికార పార్టీ నాయకుడు, ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యవం తులై తిరిగి ఇంటికి వచ్చారు. తన సొంతూరిలో గ్రామ దేవతకు మొక్కు తీర్చుకు న్నారు. పొట్టేళ్లను దేవతకు బలిచ్చి అదే గ్రామంలో విందు ఏర్పాటు చేశారు. గ్రామ స్థులతోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు, అధికారులను ఆహ్వానిం చారు. అలా ఓ పోలీసు అధికారి కూడా వచ్చారు. ఆయన భోజనం చేసి ఈవలకు రాగానే ఒక ద్వితీయ శ్రేణి నాయకుడు, మరో యువకుడిని వెంటబెట్టుకుని ఆయన వద్దకు తీసుకొచ్చి కౌన్సిలర్గా పరిచయం చేశాడు. ఆయన కూడా కాబోలనుకుని మాటలు కలిపారు. ఇంతలో ఎవరో అటుగా వచ్చి ప్రశ్నించడంతో, కౌన్సిలర్గా భ్రమ పడిన వ్యక్తి ఎప్పుడో ఆ పదవికి పోటీ చేయబోతున్నాడని ఆ ఆఫీసర్కు తెలిసి వచ్చింది. అసలు పోటీ చేస్తాడో లేదో కూడా తెలియని వ్యక్తిని, ఆ పెద్దమనిషి కౌన్సి లర్ గా పరిచయం చేశాడని తెలియడంతో ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే పని ఉందంటూ తప్పుకొన్నారా ఆఫీసర్.


- కుప్పం, ఆంధ్రజ్యోతి

(ఆంధ్రజ్యోతి దినపత్రిక చిత్తూరు జిల్లా ఎడిషన్ 26.09.2026 న ప్రచురితమైన నా రాజకీయ వ్యంగ్య కథనం.)

Comments

Popular posts from this blog

జమీందారీ బంగళా

లోయ అంచుల్లో

మరీచిక