Posts

నాయన... ఒక శాపగ్రస్తుడు!

Image
చిట్టత్తూరు నాదముని...! ప్యాంటు షర్టు... నడుముకు బిగించిన బెల్టు... చెమటలు కారి కేలర్ పాడైపోకుండా మెడకింద క్రాస్ గా మడిచి పెట్టిన కర్చీఫు... ఎడమ చేతికి నల్ల పట్టీతో బిగించిన హెచ్. ఎమ్.టి. రిస్టు వాచ్... మా నాయన చాలా సాధారణమైన మనిషి.  డొక్కు సైకిలు... దాని బారుకు కట్టిన మూడు గిన్నెల స్టీలు క్యారేజీ... వెనుక క్యారేజీ సీట్లో మడత పెట్టిన కాకి సంచి... ప్రతి ఉదయం సమయానికన్నా అర గంట ముందే చెమటలు కక్కుకుంటూ పది కిలోమీటర్ల దూరంలో ఉండే బడిలో వాలిపోవడం... మా నాయన సామాన్యమైన బడి పంతులు. ఎందుకో అప్పుడు తెలియదు కానీ , అమ్మకు తిట్లు... ఏడాదిలో ఎప్పుడో అప్పుడు నన్ను చదువుకు కూర్చోబెట్టి వీపుపై పిడిగుద్దులు... నాయన మహా కోపిష్టి. అమ్మకు సైగ చేసి ప్లేట్లో వడ్డింపజేసే అంగట్లో తెచ్చిన కారాసు పలుకులు... ప్రతి శనివారం నాకోసం ఆకులో మిగిల్చే నూనెకారం తడిసిన రుచులూరే దోసె ముక్కలు... టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు వండించి పెట్టిన ఉలస చేపల కూరలు... జబ్బుపడ్డ నా బెడ్ పక్కనే ఆస్పత్రిలో ఒట్టి నేలపై పడిగాపులు... నాయన బయటపడని ప్రేమిష్టి. అటకమీద అట్టపెట్టెల్లో గుట్టలుగా కథల పుస్తకాలు... తిన్నెమీద గుడ్డి దీపపు వెలుగుల...

ఇద్దరూ ఒకటే

Image
ప్రకృతీ అమ్మా ఒకటేగా నిలువెల్లా పూచిన ప్రేమేగా! 👉 అమ్మ పుట్టిన రోజు బహుమతిగా మా పాప గీతల్లో పురుడుపోసుకున్న చిత్రం ఇది.

"పెరటి" పదం... మల్లె మనసు

Image
మల్లెలు చూస్తే మనసు సిగ్గుగా తడబడుతుంది ఊళ్ళో కాసిన వెన్నెల గుండెలో చొరబడుతుంది

పేగు కాలిన వాసన- నేను చదువుతున్న పుస్తకం

Image
  ❤️ నేను చదువుతున్న పుస్తకం ❤️ 👉 పేగు కాలిన వాసన -- ఎ. ఎన్. జగన్నాథశర్మ దిగువ మధ్యతరగతి జీవిత వాస్తవాల నిప్పు కణికెలు చేతి వ్రేళ్ళకి తగిలి, కాలిన కమురు వాసనతో గుండెలు పిండేసేలా రాసిన కథలివి. ఈ కథల్లో ఛిద్ర జీవితాల పట్ల కసీ, కోపం, అభిమానం, జాలి, దయ.. అన్నీ కలగలసిపోయి ఉంటాయి. చెప్పదలచినదీ, చెప్పగలిగినది ఇంత వాడిగా, వేడిగా, సూటిగా, ఒడుపుగా చెప్పే అక్షర విద్య జగన్నాథశర్మకే చాతనవును. చకచ్చికితాలయిన అక్షరాలూ, పదాల పరుగుల ఉరవడీ, కెరటాల్లా విరిగి పడే వాక్యాల విరుపులూ వీటితో.. ఈ కథలన్నీ మనల్ని వెంటాడుతాయి. కన్నీళ్ళూ, వేదనలూ నిండిన ఈ కథలు మరోసారి చదవడానికి భయపెడుతూనే, మళ్ళీ మళ్ళీ చదివించేలా చేస్తాయి. అదే వీటి గొప్పతనం. -- పంతుల జోగారావు కోట్లాది మంది జీవిస్తున్న ఈ దేశంలో దీనజనులకేసి మాత్రమే అపేక్షగా చూసే చూపూ, వాస్తవికతా పరిధిని దాటిపోని యధార్థవాద దృక్పథమూ, మానవీయ విలువలకు ప్రతీకలుగా మారే వ్యక్తులతో అలవోకగా మమేకమయ్యే ధర్మ నిగ్రహమూ, మొదలు పెట్టిన నాలుగు వాక్యాలలోపే కథకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించుకునే నేర్పూ, నింపాదిగా, ఒడుపుగా, హుందాగా సాగిపోయే కథనమూ, సదవగాహనా తీరాలకు చేర్చే శిల్పమూ, సా...

లోలోపలికి

Image
శాంతి, యుద్ధమూ నీలోనే ఉన్నాయి మంచీ చెడుగూ నిలువెల్లా నిండాయి లోలోపలికి అనంత ప్రయాణం సాగాలి నీతో నువ్వే నిరంతర యుద్ధం చేయాలి అప్పుడు మిగిలేది బుద్ధత్వం లోకంలో వెలిగేది శాంతితత్వం ముని ✍️ చిత్రం: చిట్టత్తూరు లాస్య

"కథంబం"- నేను చదువుతున్న పుస్తకం

Image
నేను చదువుతున్న పుస్తకం  'కథం'బం కథా సంకలనం ✍️ ఒకరా... ఇద్దరా... ఇరవై మంది రచయితలు. 1950 నుంచి మొదలుపెట్టి, 2005 దాకా చేసిన కథలు. ఆ కథల్లో రకరకాల జీవితాలు... అనుభవాలు. గ్రంథాలయం వెళ్లే అలవాటుంటే మీకూ ఎక్కడో తారసపడకపోదు ఈ పుస్తకం. దొరికితే మాత్రం వదిలిపెట్టకండి. ఇంటికి తీసుకుని వెళ్లి చదివి ఆనందించండి. ఆణిముత్యాల్లోంచి నేను ఏరిన కొన్ని శకలాలు మాత్రమే ఇవి... ✍️ కోర్టు రమను ప్రశ్నించింది. 'నీ కులం ఏమిటి?' 'మాదిగ' 'మతం?' 'హిందువు' 'క్షత్రియ కాదా?' 'కాదు' 'తండ్రి కులం కూతురి కులం అవుతుంది కదా!' అది ఎవరైనా చెప్పేమాటే. న్యాయస్థానం, న్యాయవాదులు, న్యాయమూర్తులు అలోచించి వాస్తవం గుర్తించి ప్రకటించి తీర్పు చెప్పాలి. 'భార్యనో ఉంపుడుగత్తెనో కడుపుచేసి వదిలేసిపోయి, పుట్టినబిడ్డను చూడని, పెంచని, పోషించని, పెళ్ళిచేయని కట్నకానుకలివ్వని, మనిషెవరో తెలియని వాడు కూడా తండ్రేనా?' 'తండ్రే!' క్షేత్రం, బీజం మీద చాలాసేపు ప్రశ్నోత్తరాలు, వాదోపవాదాలు జరిగాయి. ఏమీ తేలలేదు. -- రమ నా కూతురు, 2005, కొలకలూరి ఇనాక్ ---- ✍️ "యీ చెంబూ, లక్డ...

కదలాలంతే

Image
చలనమే ప్రాణం చలనమే జీవం శ్వాస శబ్దమై మోగాక ఒళ్ళు అలలుగా ఎగిశాక ఇక అదుపు లేదు అలుపు అసలు రాదు ఆకాశాన్ని అందడమే జయగీతికగా మారడమే ముని ✍️ చిత్రం: చిట్టత్తూరు లాస్య